Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 26న చౌటుప్పల్ పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా వర్క్ షాప్‌ను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం చౌటుప్పల్‌లో పట్టణంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలన్నారు.మహిళల వస్తాధారణను తప్పుబడుతూ మాట్లాడుతున్నారని, దీనిని కొంతమంది దుండగులు ఆసరాగా తీసుకొని మహిళను హింసిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుధర్మశాస్త్రాన్ని అమలుచేస్తూ మహిళలు వంటింటికే పరిమితం కావాలని చూస్తుందన్నారు. మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలపై అనేక ఆంక్షలు విధించడం బీజేపీ దుర్భుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లా వర్క్ షాప్‌కు ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వర్క్ షాప్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దొడ్ల ఆండాలు, జయమ్మ, రేష్మ పాల్గొన్నారు.