Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
- పాఠశాల భవనం ప్రారంభం
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
విద్యతోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దకందుకూరులో తండ్రి ఇన్నయా చౌదరి జ్ఞాపకార్థం ఎన్ఆర్ఐ అనంత్చౌదరి రూ.80 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ స్కూల్ భవన సముదాయాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లడూతూ అనంత్చౌదరిని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం అనంత్చౌదరిని మంత్రి సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. విద్యతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తుచేశారు.ప్రయివేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గురుకులాలు పెంచుతూ ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు.సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి పెద్దఎత్తున ముందుకు వస్తుండడం శుభపరిణామమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌్ గొంగిడి మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాలఅశోక్ తేజ,డీఈవో నారాయణరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, సర్పంచ్ భీమగాని రాములుగౌడ్, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపల్ చైర్మెన్లు ఎరుకల సుధ, వస్పరి శంకరయ్య, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, హెచ్ఎం హరిశంకర్ తదితరులు ఉన్నారు.