Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి మండలం బస్వాపూర్ డ్యామ్ భూ నిర్వాసితుడు తిమ్మాపురం గ్రామానికి చెందిన బాల స్వామీ డ్యామ్‌లో కోల్పోయిన భూమి కి నష్ట పరిహారం డబ్బులు రాకపోవడం తో కలత చెంది నిన్న ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలనిడిమాండ్ చేస్తూ భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గ్రామస్తులు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా పలురువు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనేబాలస్వామి మృతి చెందాడని ఆరోపించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్చార్జిచార్జ్ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి వచ్చి పై అధికారులతో చర్చించి వెంటనే రూ.2 లక్షల నష్టపరిహారం అందజేశారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్ రావు, మున్సిపల్ మాజీ చైర్మెన్‌్ బర్రే జహంగీర్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షులు అతహర్ మద్దతు తెలిపారు.