Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీసభ్యుడు జల్లెల పెంటయ్య
నవతెలంగాణ-రామన్నపేట
సీపీఐ(ఎం) మండల నాయకుడుపొట్లచెర్వు రాములు ఆశయ స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కొమ్మాయిగూడం గ్రామంలో గ్రామ శాఖ ఆద్వర్యంలో రాములు ద్వితీయ వర్థంతిని నిర్వహించారు. ఈ సంధర్బంగా స్మారకస్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేట ప్రజా పోరాటాల్లో రాములు కృషి ఎనలేనిదన్నారు. జర్నలిస్టుగా, ప్రజా కళాకారుడిగా, వ్యవసాయ కార్మికసంఘం, రజక వృతిదారుల సంఘంలో బాద్యతలు నిర్వహాంచి పేదల పక్షాన పోరాడారన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీశాఖ కార్యదర్శి శానగొండ వెంకటేశ్వర్లు, ఎర్ర కాటమయ్య, పొట్లచెర్వు అచ్చాలు, పొలగోని స్వామి, అంతటి సత్తయ్య, కల్లూరి జంగయ్య, దావునూరి ప్రశాంత్, రామచంద్రం, రాధ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.