Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీి మధురస్మృతులేనని1990-1991నాటి విద్యార్థులు, పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని భానుపురి ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాలలోను, ప్రభుత్వ, ప్రయివేట్రంగంలో స్థిరపడిన వారు సోమవారం కాసరాబాదలోని వ్యవసాయ క్షేత్రంలో కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆనాటి మరపురాని మధురమైన సంఘ టనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఆద్యంతం ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. దాదాపు 32 ఏండ్ల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించు కున్నారు.అదే చదు వులమ్మ ఒడిలో నేడు గుర్తు కొస్తున్నాయి.... అంటూ ఆనంద భాష్పాలతో గత అను భవాలను నెమరేసుకున్నారు.క్లాస్ మేట్స్, బెంచ్మేట్స్తో ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో పూర్ణ,ముజీబ్, అంజలి, మాధవి, మంజుల, విజయలక్ష్మి, సునీత, వెంకటేశ్వర్రావు, కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.