Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
సీపీఐ 98వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను సోమవారం పట్టణం తో పాటు గుండ్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ కల్లెం కృష్ణ కమిటీ సభ్యులు బబ్బురి శ్రీధర్ ఏఐవైఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు సీనియర్ నాయకులు బబ్బురు నాగయ్య పేరబోయిన పెంటయ్య కౌన్సిలర్ అనిల్ నాయకులు పేరబోయిన బంగారు గొప్పగాని రాజు నర్సమ్మ ముక్కెర్ల పెంటయ్య మాటూరి మల్లయ్య కంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
రాజాపేట: సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలో అన్ని గ్రామ శాఖ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చిగుళ్ళ లింగం, మండల సహాయ కార్యదర్శి బొద్దుల ఆదినారాయణ ,దస్తగిరి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ :చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆ పార్టీ జెండాను పార్టీ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగిళ్ల మోహన్‌రెడ్డి, ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఎస్ఎ.రహమాన్, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, దాసరి అంజయ్య, బిక్షపతి, వెంకటేశ్, నర్సింహా, శ్రీను పాల్గొన్నారు.
ఆలేరుటౌన్: భూమి, భుకి, విముక్తి కోసం నైజాములను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం బస్టాండ్ ఆవరణలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకురాలు మాత్ర జానమ్మ ,చౌడబోయిన పరశురాములు, గిరబోయిన స్వామి, రాజారెడ్డి, బొడ్డు ఆంజనేయులు, జంగ సరళ, పోతు ప్రవీణ్, పల్లె శ్రీనివాస్, సిద్ధులు , వెంకటయ్య, పూలమ్మ ,అలిమ బేగం, జాంగిర్ బి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : సీపీఐ 98 వ వార్షికోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, భగవంత, ఏఐటియుసి జిల్లా ఉపాద్యక్షులు గొరిగె నర్సింహ్మ, గీతపనివారల మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, వీరమళ్ళ ముత్తయ్య, కూనూరు లక్ష్మీ నరసింహ, ఊట్కూరి కష్ణ, తదితరులు పాల్గొన్నారు .