Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-మునగాల
ప్రజలు చేసిన ఫిర్యాదుల పట్ల పోలీసులు వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు.పోలీస్స్టేషన్ల వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం మునగాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ముందుగా డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సీఐ ఆంజనేయులు ఎస్పీకి స్వాగతం పలికారు.గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ పోలీస్పరేడ్ను, సిబ్బంది టర్న్ఔట్ను,సిబ్బంది కిట్టును పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించారు.పోలీస్‌స్టేషన్ డైరీని తనిఖీ చేసి మండలంలో తరచుగా నమోదవుతున్న నేరాలు, ఫిర్యాదుల తీరుతెన్నులు, కేసుల స్థితిగతుల అంశాలను పరిశీలించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్, పెండింగ్ కేసు ఫైల్స్, కోర్టు డ్యూటీ విధులను, రిసెప్షన్ విధులు, బ్లూకోట్ విధులు, పెట్రోకార్ విధులు, కేసుల అంతర్జాల నమోదు, సీసీటీ ిఎన్ఎస్ సిస్టం, సీసీ కెమెరాల పనితీరు, సెక్షన్ విధులు, ఎస్హెచ్ఓ విధులు, పోలీసు పని విభాగాలు, అమలవుతున్న పని విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులు, ఫంక్షనల్ వర్టికల్ విభాగాలను సమర్థవంతంగా నిర్వర్తించడం వల్ల పోలీస్ సేవలు వేగంగా ప్రజలకు అందుతాయన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. కేసులు పెండింగ్‌లో వుండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ఒక టీంగా పని చేస్తూ లక్ష్యంతో ముం దుకెళ్తే అనుకున్న విజయాలను సాధించొచ్చన్నారు.గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు.కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా సామాజిక రుగ్మతలు, అసాంఘీక కార్యకలాపాలు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో అసాంఘీక కార్యకలాపాలు బెట్టింగులు, జూదం లాంటివి లేకుండా చూడాలని కోరారు.సమస్యాత్మక ప్రాంతాలను తరచు సందర్శిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నేర నివారణలో ముందుకు సాగాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు.రోడ్డు భద్రతాచర్యలను తీసుకుంటూ రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోదాడ సబ్ డివిజనల్ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ లోకేష్, ఐటీ కోర్ ఎస్సైలు రవీందర్, సత్యనారాయణ,డీసీఆర్బీ పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.