Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమము ద్వారా క్షేత్ర స్థాయి అనుభవాన్ని పొందొచ్చని కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మండలపరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో కృషి విజ్ఞానకేంద్రంలోని పీడీఎం యూనివర్సిటీ, హర్యానా రాష్ట్రాలలో బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన గ్రామీణ కృషి అనుభవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. మూడేండ్ల పాటు కళాశాలలో నేర్చుకొన్న అంశాలు కేవీకే శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామాల్లో ఆతిథ్య రైతులను ఎంపిక చేసుకొని ప్రతి రోజూ రైతూ క్షేత్రానికి వెళ్తూ, రైతులు ఆచరిస్తున్న పద్దతులు తెలుసుకొంటు వారి వ్యవసాయపద్ధతులను అధ్యయనం చేయాలన్నారు.కళాశాలలో నేర్చుకొన్న అంశాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంను రైతులకు తెలియజేస్తూ వివిధ ప్రదర్శనల ఏర్పాటు ద్వారా అవగాహన కల్పించి కృషి అనుభవాన్ని పొందాలని సూచించారు. మూడు నెలల పాటు గ్రామాల్లోనే ఉంటూ ఆయా గ్రామాల్లో సాగు చేయబడుతున్న పంటల సాగును అధ్యయనం చేయడం, కెేవీకేలో వివిధ దశలలో శాస్త్రవేత్తలు అన్ని రకాల పంటలు, ఇతర అనుబంధ అంశాలలో తగు శిక్షణను ఇస్తారని, చివరిగా విద్యార్థులు నివేదిక సమర్పించాలని తెలిపారు. తదుపరి కెేవీకే శాస్త్రవేత్త డి. నరేష్ విద్యార్థులకు రావే కార్యక్రమం నిర్వహణ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కేవీకేలో ఉన్న క్షేత్రాలను విద్యార్థుల బృందం సందర్శింపజేసీ శాస్త్రవేత్త ఏ. కిరణ్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.