Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు స్వీయ రక్షణ భద్రతా చర్యలు తీసుకోవడం సంతోషం
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-చివ్వెంల
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం మండలపరిధిలోని ఐలాపురం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను స్థానిక సర్పంచ్ బోడపట్ల సునీత శ్రీనుతో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సౌజన్యంతో, సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రూ.2.50 లక్షలతో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనుసంధానం చేశామన్నారు. నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుని పోలీస్ శాఖ ప్రణాళికతో ముందుకెళ్తుందని తెలిపారు.గ్రామ రక్షణ భద్రతలో భాగంగా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవగాహన కల్పించామన్నారు.దీంతో గ్రామస్తులు, గ్రామపెద్దలంతా ఒకతాటిపైకి వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకారం అందించారని, ఇలా ముందుకు రావడం ఆదర్శనీయమని తెలిపారు.ఏదైనా సంఘటన జరిగినట్టయితే ఆ సంఘటనకు సంబంధించిన ఆధారాలను సీసీ కెమెరా ద్వారా నిక్షిప్తం చేయవచ్చన్నారు. కోర్టులో ఆధారాలుగా సమర్పించవచ్చన్నారు.కేసుల దర్యాప్తుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామానికి రక్షణగా ఉండి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు, నేరాలు, దొంగతనాలు, ఆకతాయిపనులు నివారించబడతాయని తెలిపారు.నేరాలు అదుపు చేయడంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ప్రజలతో భాగస్వామ్యం అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా సైబర్ మోసాలు గ్రహించాలని, ఎవరైనా ఉచితంగా లాటరీలు అందాయి.. బహుమతులు అందాయని అంటే అలాంటి వాటి జోలికి పోకుండా అలాంటి వారి మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు. ఏ బ్యాంకు వారు ఫోన్ చేసి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను అడగరని ప్రజలు గ్రహించాలని, ఎవరైనా ఓటీపీ పిన్ నెంబర్లు అడిగితే అపరిచితులకు తెలియజేయవద్దని కోరారు. అనంతరం సర్పంచ్ అతిథుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమ్నారాయణ్సింగ్ ఎస్సై విష్ణు,రూరల్ ఎస్సైసాయిరాం, ఎసై-2 మధు, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు,ఉపసర్పంచ్ వినోద్‌కుమార్, ఏఎస్ఐ రత్నం పాల్గొన్నారు.