Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాలలో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, పగటిబందిగా అమలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలానికి చెందిన 78 మందికి రూ. 78 లక్షలు, కొండమల్లేపల్లి మండలానికి చెందిన 68 మందికి రూ. 68 లక్షల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను, చీరలను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమల్లోకి వచ్చిన అనంతరం బాల్యవివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మెన్ మహమ్మద్ రహత్ అలీ, జెడ్పిటిసి పసునూరి సరస్వతి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి ,వడ్తే దేవేందర్‌నాయక్, దాసురు, శ్రీను, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, నేనావత్తు రాంబాబు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, సైదులు, మహమ్మద్ రైస్, ఇలియాస్, భీంసింగు, లాలు, రాములు తదితరులు పాల్గొన్నారు.