Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
ఈనెల 30వ తేదీన నల్లగొండ జిల్లాలోని నిర్వహించే సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాలకూరి వెంకటేశ్వర్లుగౌడ్, కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు జెట్టమోని యాదయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి పట్టణంలో గ్రామీణ వైద్యుల సంఘం మహాసభ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామాలలో పట్టణాలలో పనిచేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా డివిజన్ అధ్యక్షులు ఏ.కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు బీ. శ్రీనివాస్, లక్షణాచారి, ఉట్కూరి వేమన్ రెడ్డి, సీహెచ్. శ్రీనివాసులు, బీఏ. చారి, మసూర్, బొడ్డుపల్లి ముత్యాలు, జే.శ్రీకృష్ణ, గోపాల్‌చారి, వీ.ధనుంజయ, ఆంజనేయులు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.