Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నోముల భగత్
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం మండలంలోని తేట్టేకుంట గ్రామానికి చెందిన కొత్త వెంకటయ్య అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే ట్రై సైకిల్ తెప్పించి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్లు తేట్టేకుంట గుండెబోయిన లింగయ్య, దానిసింగ్ తండా సర్పంచ్ సహలహాదారుడు దూప్ సింగ్, నాయకులు మెగావత్ హనుమా నాయక్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కమలాకర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.