Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలోని 17200 మంది రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్, శాసనమండలి సభ్యులు తక్కల్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి నాగరాజు నాయకత్వంలో హైదరాబాదులోని ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలలో వే బ్రిడ్జిలను త్వరలో ఏర్పాటు చేస్తామని, రేషన్ డీలర్ల సమస్యలను పరిశీలించి ముఖ్యమంత్రి వద్దకు త్వరలో తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు రేషన్ డీలర్ల నాయకులుపేర్కొన్నారు. ఐటీ మంత్రిని కలిసిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దాస్యం విజయభాస్కర్, నన్నపనేని నరేందర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మెన్ బాచిరెడ్డి గోవర్ధన్, రేషన్ డీలర్ల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వెలగల రాజయ్య, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, అనుముల మండల అధ్యక్షులు కోట్ల సరిత అశోక్, భువనగిరి జిల్లా కార్యవర్గ ఉపాధ్యక్షులు సంజీవరావు, వలిగొండ మండల అధ్యక్షులు పాశం స్వామి, తదితరులు పాల్గొన్నారు.