Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ను నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి సోమ వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి మండలంలో వివిధ కేసులకు సంబంధించిన ఫిర్యాదులను, వాటి పరిష్కారంలో పురోగతికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకూడదని, క్లిష్టమైన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలన్నారు. ఆయన వెంట నార్కట్పల్లి సీఐ శివరామిరెడ్డి, ఎస్సై రామకృష్ణ ఉన్నారు.