Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికాలను ఆదేశించారు. మంగళవారం నకిరేకల్ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో ఓపీ విభాగం, ఆస్పత్రికి వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించే టీి.హబ్ ల్యాబ్‌ను పరిశీలించి టెస్ట్‌ల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి నెల సరాసరి 1200 టెస్ట్‌లకు టీ హబ్ డయాగ్నొస్టిక్ కేంద్రంకు పంపుతున్నట్లు వైద్యాధికారులు వివరించారు. ఫార్మసీ భాగం, ఆస్పత్రిలో వార్డ్‌లను కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో పీడియాట్రిక్, గైనిక్ వార్డులపై కప్పు పెచ్చులు ఊడి, లీకేజీ లు గమనించి రిపేరు చేయుటకు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఈఈని ఆదేశించారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి 3 నెలలుగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అవుతున్న డాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని ఆదేశించారు. అనంతరం వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనాథ నాయుడు తదితరులున్నారు.