Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-మడుగులపల్లి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలో ఈనెల 29న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారిఐలయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మహాసభల పోస్టర్ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన వ్యవసాయ కార్మికులు తీవ్రమైన అర్థిక ఇబ్బందులు పడుతున్నరని, కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు, సంక్షేమ పథకాల అమలు నిర్లక్ష్యం చేశారని వాటి అమలు కోసం ప్రభుత్వాలపై ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుండి 1000 మంది ప్రతినిధులు మహసభలకు హజరౌతున్నట్టు, లక్ష మంది వ్యవసాయ కార్మికులతో బహిరంగసభను జరుపుతున్నట్టు తెలిపారు. సభకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. పేదలందరికీ విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా సహయ కార్యదర్శి మన్యం బిక్షం, సీఐటీయూ జిల్లా నాయకులు రొంటి శ్రీను, తిప్పర్తి మండల కార్యదర్శి గండమల్ల రాములు, మడుగులపల్లి మండల కార్యదర్శి బొంగర్ల వెంకటయ్య, శరత్ పాల్గొన్నారు.
నల్లగొండరూరల్ : ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ పిలుపునిచ్చారు. మంగళవారం కనగల్లు మండలంలోని జి చెన్నారంలో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ..ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు కట్టా అంజయ్య, జిల్లపల్లి లింగమ్మ, మల్లయ్య, జ్యోతి, రాములు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : ఈనెల 29, 30, 31 తేదిలల్లో ఖమ్మంలో జరిగేతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం డొక్కలబావి తండాలో వ్యకాస మూడవ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29న జరిగే ప్రజాప్రదర్శన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు కదలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు జటావత్ రవినాయక్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అంకపక సైదులు, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఈనెల 29 నుండి 31 వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చలకాని మల్లయ్య, వ్యకాస జిల్లా నాయకులు మక్కా బుచ్చి రాములు తెలిపారు. మంగళవారం శాలిగౌరారం మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కల్లూరి లింగయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు నూనె గట్టయ్య, డెంకల లింగయ్య, గుండ్ల అంజయ్య, కల్లూరి అంజయ్య, బల్లెం వెంకన్న, ముత్తయ్య, అంకిరెడ్డి సైదులు, చర్లపల్లి అనసుర్య పాల్గొన్నారు.
నాంపల్లి :ఈనెల 29 నుండి 31 వరకు ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము లక్ష్మయ్య, కే.దిలీప్, కే. రాములు, సైదులు, వెంకటయ్య అరుణమ్మ, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.