Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నియోజక వర్గంలో 70 పాఠశాలలు పునరుద్ధరనకి రూ.40 కోట్ల 68 లక్షల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. మన ఊరు మన బడి పథకం కింద మంగళవారం పట్టణ పరిధిలో మెయిన్ బజారు, గాంధీ నగర్, నంది పాడు పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, ప్రహరీ గోడలు, వంట గది, మరుగుదొడ్లు వంటి అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, చిట్టిబాబు, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు ఇందిరా గోవింద్‌రెడ్డి, ఉబ్బపల్లి వెంకమ్మ సోములు, నాగార్జున చారి, మగ్దూం పాషా తదితరులు పాల్గొన్నారు.
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గ వ్యాప్తంగా 41 మందికి రూ.21 లక్షల 5 వేల విలువ గల చెక్కులు మంజూరు అయినట్టు తెలిపారు. కార్పొరేట్ వైద్యం కోసం సీఎం కేసీఆర్ అందిస్తున్న గొప్ప వరం సీఎంఆర్ఎఫ్ పథకమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీలు నూకల సరళ హనుమంత రెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్, నాయకులు వీరకోటి రెడ్డి, హాతిరాం నాయక్, రవితేజ నాయక్, ఇరుగు వెంకన్న, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.