Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్ఎం
ఆలేరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడమే తమ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.ఆత్మకూర్, మూటకొండూర్ మండలల్లో బునాదిగాని కాల్వపనులబడ్జెట్ కొరతతో అసంపూర్తిగా నిలిచిపో యిన బునాదిగాని కాల్వ పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి సొంత నిధులతో మంగళవారం మండలంలోని సర్వపల్లి గ్రామంలో బునాదిగాని కాల్వపనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు.సాగు కాల్వ నిర్మాణంతో 20,500 ఎకరాలు సాగవుతుందన్నారు. ఏడు మండలాలలో 50 ట్యాంకులను నింపడం జరుగుతుందని తెలిపారు. వీరవెల్లి వద్ద ఓటీ5 బునాదిగాని కాల్వతో కలుస్తుందన్నారు.తద్వారా సాగుకు సరిపడా నీరందుతుందని పేర్కొన్నారు. బునాది గాని కాల్వ నిర్మాణ పనులు 98 కిలోమీటర్లు నిర్మాణం జరుగు తుండగా, ఆత్మకూరు మండలంలో సర్వేపల్లి నుండి పుల్లాయిగూడెం వరకు 20 కిలోమీటర్లు పనులు జరుగుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేయిస్తానన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వపథకాలు కొనస్తాగించడంతో, బడ్జెట్ కేటాయింపులు జరగక పోవడంతోనే రోడ్డు పనులలో ఆలస్యమవుతుందన్నారు.త్వరలోనే రోడ్డు పనులు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీిఈ సునీల్ ప్రసాద్ , ఆర్ఐ యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పైళ్ళ సత్యనారాయణరెడ్డి, మోటకొండూరు జెడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ యాస కవిత, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ కోరే భిక్షపతి, సర్పంచులు సుంకుశాల ఎల్లయ్య, భాషబోయిన ఉప్పలయ్య, కోల సత్తయ్య, లగ్గాని రమేష్, సామ తిరుమల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పంజాల వెంకటేశం, వెంకటేశం, మండల మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ తదితరులు పాల్గొన్నారు.