Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
పోలీస్ నియామకాల్లో బీఆర్ఎస్ నిర్లక్ష్య వైఖర్ని ఖండిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఇంద్రాపార్కు ధర్నాచౌక్‌లో చేస్తున్న సమర దీక్షా కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో యువసేనరెడ్డి మాట్లాడుతూ పోలీస్ నియామకాల్లో ఏడు మల్టీపుల్ క్వశ్చన్స్‌ను వెంటనే చేర్చి హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిణయంలోకి తీసుకొని వెంటనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు పుట్టా గిరీష్ కుమార్‌గౌడ్, ముత్యాల మనోజ్కుమార్యాదవ్, ఎలిమినేటి సురేష్, యువజనకాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్, ఉపాధ్యక్షులు మాచర్ల వినరు, ప్రధాన కార్యదర్శి బద్దం వాసుదేవారెడ్డి, బత్తిని వరుణ్, యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్రకార్యదర్శి పాడిగల ప్రదీప్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు పాల్గొన్నారు.