Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి తనభూములు, బంధువుల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ.శ్యాంసుందర్‌రావు డిమాండ్ చేశారు.తమ భూముల దగ్గర నుంచి పోతుందన్న కారణంగానే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పించారని ఆరోపించారు.ఆయన కుట్ర కారణంగా అనేక మంది రైతులు నష్టపోతున్నారన్నారు.ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు.జిల్లా ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇసుక అమ్ముకోవడం తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయకపోవడం వల్ల జిల్లాలో నిర్మాణం చేపట్టిన బస్వాపురం, బునాదికాల్వ, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి కాల్వలు ఆగిపోయాయని ఆరోపించారు.గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తారా..? లేదా..? కూడా తెలియని స్థితిలో ఉన్నదన్నారు.భూమిని సేకరించి రైతులకు పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు.బస్వాపురం రిజర్వాయర్ పరిహారం అందకపోవడం వల్లనే యువకుడు బాలస్వామి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.పిలాయిపల్లి కాల్వ పరిధిలో క్రాఫ్ హాలిడే ఎందుకు ప్రకటిస్తున్నారో కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అనంతరం కలెక్టరేట్ ఏవో నాగేశ్వరాచారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, జిట్టాబాలకృష్ణారెడ్డి, పడాల శ్రీనివాస్, సూదగాని హరిశంకర్‌గౌడ్, సుర్వి లావణ్య, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, చందా మహేందర్‌గుప్తా పాల్గొన్నారు.