Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక నష్టాలకు గురవుతున్న రైతులు
- పట్టించుకోని ప్రభుత్వం,అధికారులు
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
విద్యుత్ లో ఓల్టేజీ సమస్య రైతులను పట్టి పీడిస్తుంది.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం,అధికారులు పట్టించుకోక పోవడం వల్ల రైతుల బోరు బావుల మోటారులు,ఆటోమేటిక్ స్టార్టర్లు నిత్యం కాలిపోతున్నాయి. దీంతో రైతులు ఆర్ధిక నష్టాలకు గురౌతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.మండలంలో 31 గ్రామాల పంచాయతీలు,36 ఆ వాస గ్రామాలు ఉన్నాయి. నారాయణపురం, సర్వేలు, జనగాం, లింగవారి గూడెం,బోటిమీదితండాల్లో 33/11 కే.వీ సబ్ స్టేషన్లున్నాయి.వీటి పరిధిలో విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం 1225 ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు.ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ద్వారా వ్యవసాయ బోరుబవులకు 440 కే.వి,గహ వినియోగ అవసరాల కోసం 230 కె.వి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.మండలంలో 5995 వ్యవసాయ బోరుబావులు,12490 గహ వినియోగదారుల,5 ఇండిస్టియల్,మరో 6టవర్ కనెక్షన్లు ఉన్నాయి.అవసరానికి మించి విద్యుత్‌ను వినియోగించుకోవడం వల్ల లోఓల్టేజీ సమస్య తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు.మండలంలో రెండేండ్లుగా అత్యధికంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి.దీంతో రైతులు అనుమతులు లేని బోరుబావులను సైతం నడిపించడం వల్ల లోఓల్టేజీ సమస్య ఉత్పన్నమవుతుందన్న విమర్శలు వినవస్తున్నాయి.దీనికి తోడు అత్యధిక మంది రైతులు 5 హెచ్‌పీ మోటార్లకు బదులు 7హెచ్‌పీ మోటార్లు వాడడం,కంపనీ మోటార్లు వాడక పోవడం వల్ల విద్యుత్ అత్యధికంగా ఖర్చవుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రాన్స్ఫార్మర్లలో 50కి పైగా అదనపులోడు భరిస్తున్నాయన్నారు.అదనపుట్రాన్స్ఫార్మర్లు బిగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
కంపెనీ మోటర్లు వాడాలి
ట్రాన్స్‌కో ఏఈ-ఎస్ఎన్ జయన్న
వ్యవసాయానికి విద్యుత్ లోఓల్టేజీ సమస్య ఉన్నమాట వాస్తవం. బయటపడేందుకు ట్రాన్స్ఫార్మర్ల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి.ఐఎస్ఐ ముద్రగలిగిన కంపెనీ మోటార్లనే వాడాలి.అనధికారికంగా విద్యుత్‌ను వాడు కుంటున్నారు ప్రభుత్వానికి డీడీలు కట్టాలి.
నారు ఎదిగినా పొలం తడవలేదు
రైతు-ఏపూరి నర్సింహ
నారు బోసి నెల కావస్తున్నా లోఓల్టేజీ విద్యుత్ సమస్యతో పొలం తడవలేదు. ఫుష్కలంగా నీరున్నా మోటార్లు పోస్తలేవు.కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించి సమస్యను పరిష్కరించాలి.