Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రిబాయి పూలే అని ఆమె స్ఫూర్తితో విద్యా పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం,ముత్తిరెడ్డిగూడెం గ్రామాలలో సావిత్రిబాయి ఫూలే 192 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అనాజిపురంలో విద్యారంగం - ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రిబాయి ఫూలే ఒకరిని ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయినినని అన్నారు. నేడు బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మొత్తం ప్రయివేటీకరణ చేయాలని కుట్ర చేస్తుందన్నారు. విద్య రాష్ట్రాల పరిధిలో ఉన్న హక్కులను అరించి కేంద్ర ఆధీనంలో తీసుకొని మరో మారు మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన అశాస్త్రీయమైన విద్యను ముందుకు తెచ్చి మూడ విశ్వాసాలను పెంపొందిస్తూ భూత వైద్యం కూడా ప్రవేశపెట్టాలని కుట్రలు చేస్తున్నదన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధమై తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్.లక్ష్మి, ఉపాధ్యాయులు పి.మురళి, వి.శ్రీదెవి, బి.నారాయణ మరియు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మునుగుంట్ల శ్రీనివాస్, ఎల్ఐసి ఏవోఐ జిల్లా నాయకులు ఏదునూరి మల్లేశం, డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, ఎన్పీఆర్డీ జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లపల్లి కిషన్, కల్లుగీత కార్మిక సంఘం మండల నాయకులు కొండ అశోక్, జీఎంపీఎస్ మండల నాయకులు కూకుట్ల కృష్ణ , ఐద్వా మండల నాయకురాలు కొండ హైమావతి, డీివైఎఫ్‌ఐ మండల మాజీ కార్యదర్శి ఏదునూరి వెంకటేశం, వ్యకాస నాయకులు బొల్లెపల్లి పరమేష్, కడారి కృష్ణ, నాగుల పాండు, చేగురి రాజు పాల్గొన్నారు.
సావిత్రి బాయి ఫూలే జయంతి ని అధికారికంగా నిర్వహించాలి
చదువుల తల్లి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే జయంతి ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఎంపీపీ నరాల నిర్మల డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘంజిల్లా అధ్యక్షులు రావుల రాజు, మున్సిపల్ చైర్మెన్ ఎన్నబోయిన ఆంజనేయులు, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పీసీసీ సభ్యులు తంగెళ్ళపల్లి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండరూరల్ : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, మండల సహాయకార్యదర్శి పోలేపాక విష్ణు,కళాశాల కన్వీనర్ సీరి,కో-కన్వీనర్ ఆముల్యా నాయకులు వేముల ఇమ్మానిల్,రాచమల్ల రాజు కళాశాల నాయకత్వం తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మాతృమూర్తి, దేశ సామాజిక మార్పుకు మార్గం చూపిన మొట్టమొదటి ఉపాధ్యాయిని సావిత్రిబాయిపూలే అని, నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగదేవి సైదులు తెలిపారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి విజ్ఞానకేంద్రంలో వ సంఘం మండలకమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండలకార్యదర్శి బొజ్జ బాలయ్య, నాయకులు చీరిక సంజీవరెడ్డి, మానె సాలయ్య, మామిడి స్వరూప, పద్మ, యాట బాలరాజు, రమేశ్, బోయ యాదయ్య, శ్రీను, మదార్, అంతటి అశోక్, బాలనర్సింహా, కొంతం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.ఐద్వా ఆధ్వర్యంలోః చౌటుప్పల్ పట్టణకేంద్రంలో మంగళవారం ఐద్వా మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకురాళ్లు జయమ్మ, రేష్మ, ఆండాలు, అనురాధ, స్వరూప, స్వప్న, శారద, రేణుక, పద్మ, నర్మద, నాగలక్ష్మీ పాల్గొన్నారు.
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ,సందెల రాజేష్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు సురుపంగ శివలింగం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కృష్ణలి మాట్లాడారు. సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాల న్నారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు మాట్లాడుతూ దేశంలో మహిళలు విద్యకు సామాజిక గౌరవాలకు దూరంగా ఉన్నారన్నారు . జిల్లా కార్యదర్శి సందెల రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు బోడ హనుమంత్, అధ్యాపకులు, పాల్గొన్నారు.
మోత్కూరు : సావిత్రిబాయిపూలే 192వ జయంతిని మంగళవారం మోత్కూరులో సీపీఐ(ఎం), ఎస్ఎఫ్ఐ, బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించిఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి,సీఐటీయూ జిల్లా నాయకుడు కూరెళ్ల నర్సింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్, బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, నాయకులు గుండగోని రామచంద్రు, శ్రీనివాస్, డి.సత్యనారాయణ, అవిశెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.