Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
సాయుధ పోరాటంలో సమరసేనానిగా పనిచేసిన జైని మల్లయ్య గుప్తా స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి .రఘుపాల్ పిలుపునిచ్చారు. దుంపల మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని సుందరయ్య భవన్లో స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు జైని మల్లయ్య గుప్తా సంస్మరణ సభ ట్రస్ట్ చైర్మెన్గూడూరు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి కేంద్రంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వన్న భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో రేణిగుంట చింతలపూడి రామ్ రెడ్డి దళంలో దళా సభ్యుడిగా చేరి పోరాడిన చరిత్ర మల్లయ్యది అన్నారు. జమీందారీ, సీపీిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సమస్యలపై సంగటిత ఐక్య పోరాటాల ద్వారా ఎదుర్కోవాలని జైని మల్లయ్య స్పూర్తితో 11వ ఆంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన భువనగిరికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. నేటి యువతరం జైని మల్లయ్య స్ఫూర్తిని అలవర్చుకొని పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్దన్, బీఎస్పీ జిల్లా నాయకులు బట్టు రామచంద్రయ్య, వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ , కోశాధికారి మాటూరి బాలరాజ్ ,ట్రస్ట్ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,బట్టుపల్లి అనురాధ ,సీపీఐ జిల్లా నాయకులు ఏషాల అశోక్, రైతు సంఘం అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, గడ్డం వెంకటేష్, వనం రాజు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, మంగ నరసింహులు, కల్లూరి మల్లేశం పాల్గొన్నారు.