Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పథకం కోసం గొల్ల కురుమల ఖాతాలో జమచేసిన నగదుతో గొర్రెలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బుధవారం పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హైదరాబాదులోని ఆయన ఛాంబర్లో ఆ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. మునుగోడు ఉప ఎన్నికల ముందు నియోజకవర్గంలోని 7600 మంది గొల్ల కురుమలకు గొర్రెల పథకంలో గొర్రెలకు బదులుగా రూ.లక్షా58 వేల రూపాయలు జమ చేసి ఖాతాలను నిలుపుదల చేసిన దానిని ఎత్తివేయాలని కోరారు.ఖాతాలను ప్రిజ్ చేయడంతో సొంత డబ్బులు.ధాన్యం అమ్ము కోగా వచ్చిన డబ్బులు రైతుబంధు డబ్బులు తీసుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెంటనే డైరెక్టర్ రామచంద్ర తో పాటు సంబంధిత అధికారులు పిలిచి మాట్లాడారు.గొర్రెలకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని 12తేదీలోపు పూర్తి కావాలని ఆదేశించారు. నల్లగొండ. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇతర డబ్బులు తీసుకుటకు ఫ్రీజింగ్ ను తొలగించాలని గొర్రెల కొనుగోలు పై గొల్ల కురుమల అభిప్రాయాలు తీసుకుని ఇతర రాష్ట్రంలో వారికి నచ్చిన చోట కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, వంగూరి సత్తయ్య యాదవ్,ఈడుదుల ఐలయ్య, జనగాం వావిలపల్లి గొర్లకాపరుల సంఘం అధ్యక్షులు కుట్ల నర్సింహ,బచ్చనగోని సుభాష్,నాయకులు వంగూరి యాదయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.