Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీని ప్రాణాళికాబద్ధంగా అన్ని విధాలా అభివద్ధి చేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనుల్లో భాగంగా మంగళవారం 2వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీకి రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రితో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా నిధులు మంజూరు చేయిస్తూ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులుచేపట్టి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, కమిషనర్ సి. శ్రీకాంత్, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, మలిపెద్ది రజిత, దబ్బెటి విజయ, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, రైతుబంధు మండలఅధ్యక్షుడు కొండా సోంమల్లు, తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన రిపోర్టర్ గుంటి అయిలయ్య తండ్రి రామనర్సయ్య, మండలంలోని పనకబండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తిని హన్మంతు కుమారుడు రాంబాబు ఇటీవల మతి చెందగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులచిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిపోర్టర్ అయిలయ్య కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2, 10వ వార్డులకు చెందిన వివిధ పార్టీల నుంచి 150 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలంతా పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు.