Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అమలు చేయడం మరిచారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆ పార్టీ పట్టణ, మండల జనరల్ బాడీ సమావేశం ఏసి రెడ్డి భవనంలో మండల కమిటీ సభ్యులు సుధా గాని సత్య రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు ను రెవిన్యూ డివిజన్ గా మారుస్తామని పత్రిక ముఖంగా ప్రకటించిన ఎమ్మెల్యే సునీత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని అతి త్వరలోనే ఆలేరు రెవెన్యూ డివిజన్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పి రెండేండ్లు గడిచిందని గుర్తు చేశారు. దాని ఉసేత్తక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో పయనించడం కోసం ,రెవెన్యూ డివిజన్ తో పాటుగా గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణం కూడా చేయాలని, ఈ ప్రాంతంలో తాగు ,సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుండి కనీసం గంధమల్ల రిజర్వాయర్ కోసం నిధులు సాధించలేకపోవడం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఇతర సదుపాయాలు లేనందున ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా అభివద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రాన్ని కలుపుతూ వివిధ గ్రామాలకు బ్రిడ్జిల నిర్మాణం త్వరితగతిన నిర్మించాలని కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ాళీ స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న వారికిఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ, మండల కార్యదర్శులు ఎంఏ.ఇక్బాల్, ధూపటి వెంకటేష్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్ , వ్యకాస మండల అధ్యక్షులు జూకంటి పౌలు, మండల నాయకులు సుధాగాని సత్య రాజయ్య, ఘనగాని మల్లేష్, తాళ్లపల్లి గణేష్, మొరిగాడు మహేష్, మురిగాడి అజరు, ఎలుగల శివ,కాసుల నరేష్, వడ్డేమాన్ బాలరాజు, కేతావత్ లక్ష్మి, రాములు నాయక్,గజ్జల నరసింహులు, సిరిగిరి సారయ్య, అందే.అంజయ్య, ఎర్ర రాజు, దండు నాగరాజు, గొడుగు దాసు, ఘనగాని రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.