Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు, తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎం.రాంబాబు లు అన్నారు.రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీని పరిరక్షించాలని, ఆర్టీసీ కార్మిక ఉద్యమంపై ఆంక్షలు ఎత్తి వేయాలని కోరుతూ ఈ నెల 3 నుండి జనవరి 11 వరకు జరిగే రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్ర పోస్టర్ను మంగళవారం స్థానిక కార్యాలయంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 3 నుండి ఖమ్మంలో ప్రారంభమయ్యే రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్ర జనవరి11న సంగారెడ్డిలో ముగింపుసభ ఉంటుందన్నారు.రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది పైగా కార్మికులు ఉన్నతమైన చదువులు చదువుకొని పోట్ట కూటి కోసం ఆటో ట్యాక్సీ, గూడ్స్రవాణా, స్కూల్ బస్లు వంటి వాటిల్లో పనిచేస్తున్నారని వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అంతే కాకుండా వేధింపులకు గురై అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రవాణా రంగం లో పని చేసే కొంత మంది రోజుల తరబడి ఇంటి మొఖం చూడని పరిస్తితి ఉందన్నారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని, కోరుతూ జరుగుతున్నా రవాణా రంగకార్మిక సంక్షేమ యాత్ర నాల్గో తేధి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట కొత్త 4బస్టాండ్ కు చేరుతుందని తెలిపారు. అనంతరం ర్యాలీ కొనసాగి పాత బస్టండ్ సమీపంలో సభ ఉంటుందని చెప్పారు.ఈ సభలో ఎస్ వీరయ్య, శ్రీకాంత్ పాల్గొంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రామిక మహళా కన్వీనర్ యాకలక్ష్మీ, ఎం.సుందరయ్య, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.