Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలో తెలంగాణ గిరిజన బాలికల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై ఆదివారంరాత్రి లైంగిక దాడి జరిగిన సంఘటనను అధికారులు మంగళవారం కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.ఈ మేరకు ఆర్సీఓ లక్ష్మయ్యతో పాటు డీఎస్పీ నాగభూషణం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులను జరిగిన తీరును అడిగి తెలుసు కున్నారు.భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.ఈ మేరకు ఆర్సీఓ లక్ష్మయ్య ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులను ప్రత్యేకంగా విచారించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన విషయంపై పూర్తిగా తాను విచారణ చేపట్టానని నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. పాఠశాలలో అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, త్వరలో వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు.అనంతరం డీఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ లైంగిక దాడి జరిగిన విషయంపై పూర్తిగా విచారణ చేపట్టామని,దాడికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు ఫోక్సో కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ మేరకు విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలతో పాటు చదువు యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో తహసీల్దార్ రాంప్రసాద్, ఎస్సై డానియల్‌కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహిమూద్అలీ, ప్రిన్సిపాల్ దుర్గాభవానితో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.