Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్ ముందు ఉంచి ధర్నా
నవతెలంగాణ-పాలకవీడు
మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుని చావుకు పోలీసులే కారణం అంటూ మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు.స్థానిక పోలీసులు,హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, పరిసర మండలాల ఎస్ఐలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని గుడిగుంట్ల పాలెం గ్రామానికి చెందిన ఎస్కె.నాగుల్ మీరా తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే మృతునితో పాటు మరో ఇద్దరు డిసెంబర్ 31 రాత్రి, పాలకీడు గ్రామానికి చెందిన పగడాల జ్యోతిబసు, ఓరిగార్ల సైదులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన కేసులో ఉన్నారు. 31 రాత్రి ప్రమాదంలో గాయాల పాలైన జ్యోతి బస్ అనే యువకుడు హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు.బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై సైదులు గౌడ్ జనవరి 2 సోమవారం విచారణలో భాగంగా మృతుడు ఎస్కె.నాగుల్‌మీరా, అతని తండ్రి లతీఫ్‌ను, మరో ఇద్దరు యువకులను విచారించారు.రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఇంతలో క్షణికావేసానికి గురైన యువకుడు బల్వన్ మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి తక్షణ న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు, బంధువులు మొండి పట్టుపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సాయంత్రం వేళ స్కూల్ బస్సులో పిల్లలు రోడ్డుపై ఆగిపోయారు. బాధితులకు ఫిర్యాదు ఇవ్వవలసిందిగా పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వారిని చెదరగొట్టి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది.ఓవైపు మూడు రోజుల కింద ప్రమాదానికి గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడం, మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని నచ్చచెప్పినా మృతుని బంధువులు వినకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.