Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుండి నిర్వహించు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ా్ల కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ జిల్లాలోని 475 గ్రామపంచాయతీలలో 616 క్యాంపులు ఏర్పాటు చేసి వందరోజులలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి 50 టీమ్లను ఏర్పాటు చేసినట్లు, ప్రతి టిమునందు ఎనిమిది మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి టీములో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, ఆప్తమాలజిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రతి క్యాంపు నందు ఆటో రిఫ్రాక్టోమీటర్, లెన్స్, కంటి చూపు పట్టిక, ఒక టార్చ్, అవసరమైన కంటి చుక్కలు ,మందులు ప్రతి క్యాంపు నందు సిద్ధంగా ఉంచుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైద్య సిబ్బంది అందరికీ వాహనాలు, వసతి, భోజన సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీకుమారి, డీఎంహెచ్ఓ కోటాచలం, డీపీఓ యాదయ్య, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.