Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.మఠంపల్లి నుండి మట్టపల్లి వెళ్ళే రహదారిలో 540 సర్వే నెంబర్ లో 46 ఏకరాల భూమి కబ్జా చేశారని ఆరోపించారు.ఈ భూమిలో గతంలో ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డ్ పెట్టినప్పటికీ ఆ బోర్డు ను తొలగించి కబ్జా కు పాల్పడ్డారని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే రూ.100ల కోట్ల విలువైన భూమిని ఇలా కబ్జాలకు పాల్పడడం అన్యాయమన్నారు.హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్ల గత గ్రామపంచాయితీ ఆస్తులు ఇప్పటి మున్సిపల్ ఆస్తులు కబ్జాకు గురయ్యాయన్నారు.వీటిని వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.విషయాన్ని ఈనెల 6న నియోజకవర్గానికి రానున్న మంత్రి కేటీఆర్‌కు వివరిస్తామన్నారు. అంతేగాక మున్సిపల్ కార్యాలయంలో జరిగే అనేక అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక వెంటనే సంబంధిత విషయాలపై విచారణ జరిపి బాదితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్లు కోతి సంపత్‌రెడ్డి, తేజావత్రాజా, నాయకులు సులువ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.