Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకునే నాథుడే కరువు
నవతెలంగాణ-మోతె
ఖమ్మం-సూర్యాపేట సరిహద్దు గ్రామాలైన ఉర్లుగొండ,నర్సాపురం గ్రామాల మధ్య పాలేరు వాగులో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా విరజిల్లుతున్నా పట్టించుకునే నాధుడే లేడని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.రూ.కోట్లతో ఆనాటి తెలుగుదేశంలో గ్రామాల మధ్య నిర్మించిన వంతెన ప్రమాద హెచ్చరికలు మోగిస్తున్న అక్రమ ఇసుక వ్యాపారం అధికారులు ఆపలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పడవలతో నీళ్ళల్లో మునిగి ఇసుక సేకరిస్తుంటే చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.అయినా పోలీసులు, రెవెన్యూ,మైనింగ్ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.ఇసుక వ్యాపారులు ఖమ్మం, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో మోతె మండలంలో ఇసుకను విక్రయిస్తున్నారు.ట్రాక్టర్కు రూ.6 వేల నుండి రూ.7 వేల వరకు కూడబెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.వంతెన సమీపంలో ఇసుకతోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రజల ఆరోపిస్తున్నారు.గతంలో జిల్లా అధికారులు నల్లగొండలో ఉన్న సమీపంలో సూర్యాపేట జిల్లా ఉన్నా పరిస్థితిలో మార్పు లేదని ప్రజల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుక వ్యాపారానికి అడ్డు కట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.