Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
కోదాడ ప్రాంతానికి చెందిన దళిత విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా మా స్కూల్లో సీటు వచ్చిందని మాయ మాటలు చెప్పి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చిన స్కూలుకు వెళ్లకుండా ఆపిన సైదయ్య కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం ఉచితంగా వసతి కల్పించి విద్యను అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి డిమాండ్ చేశారు.మంగళవారం బెస్ట్ అవైలబుల్ సీటు పొంది మోసపోయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత విద్యార్థులకు సూర్యాపేట లోని నవోదయ పాఠశాలలో సీటు వస్తే ముందే అడ్మిషన్లు చేసుకొని విద్యార్థులను జాయిన్ కాకుండా సైదయ్య కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం అడ్డుకోవడం సరికాదన్నారు.అంతా అయ్యాక సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు పంపించాక మీరు నవోదయ స్కూల్ వెళ్లి జాయిన్ అవ్వాలని చెప్పి, విద్యార్థులు వెళ్లే లోపు సమయం గడిచిపోయిందని పేర్కొన్నారు సైదా కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుమూలంగానే మంగళవారం విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. కావున సైదే కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం నష్టపోయిన విద్యార్థులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా వసతికల్పించి పదవ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డీబీఎస్యూ జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాస్,విద్యార్థుల తల్లిదండ్రులు నరేష్, సురేష్, వెంకన్న, వీరస్వామి, స్వాతి,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.