Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లాప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-నల్గొండ
జనవరి 3న బాలిక అక్షరాస్యత దినోత్సవం టీచర్స్డేగా ప్రకటించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంగళవారం దొడ్డి కొమరయ్య భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ మూడువేల ఏండ్లుగా శూద్రులకు, మహిళలకు చదువును నిషేధించిన మనుస్మృతిని ఛేదించిన చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, దండంపల్లి సరోజ, జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి, బోల్లేపల్లి మంజుల, ఎండి సుల్తానా, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కేవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి
ఆధునిక భారతదేశ నికి సామాజిక విప్లవ మాతృమూర్తిగా నిలిచిన సావిత్రిబాయి ఫూలే జీవితం స్ఫూర్తిదాయకం మని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కర్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.మంగళవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించిన జయంతి జరిగిందీ. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కంటే ముందు దేశంలో మనస్ఫూర్తి నిషేధాజ్ఞల వల్ల చదువుకి మెజారిటీ ప్రజలు దూరం కావడం వల్ల దేశం వెనకబడిందన్నారు. దేశంలో నేటికీ 64శాతం మాత్రమే అక్షరాస్యత ఉందన్నారు. నాడు పూలే దంపతులు శూద్రులకి మహిళలకు అస్పృశ్యులకి చదువు నేర్పి ఉండకపోతే ఈరోజు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఏ హక్కులు ఉండేవి కావన్నారు . తవిద్య అందరికి అందకుండా కేంద్ర బీజేపీ సర్కార్ నూతన విద్యావిధానం తెచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ బండ శ్రీశైలం బి రెడ్డి సీతారాంరెడ్డి మన్యం బిక్షం గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న నల్పరాజు సైదులు కోట్ల అశోక్ రెడ్డి గండమల్ల రాములు బొల్లు వసంత కుమార్ కట్ట అంజయ్య కొత్త అంజయ్య తదితరులు పాల్గొన్నారు.