Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఇచ్చిన హమిని అమలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని నినాదాలులి
- మెట్ల మార్గం వద్ద భారీ మానవహారం
నవతెలంగాణ,యాదగిరిగుట్ట:
డీఎస్సీ 2008 మెరిట్ అభ్యర్థులు శుక్రవారం యాదగిరిగుట్టలో భారీ పాదయాత్ర చేపట్టారు.నరసింహస్వామి మొక్కలు సీఎం కేసీఆర్కు వేడుకోలు పేరుతో కార్యక్రమంలో భాగంగా 400 మందికి పైగా అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పు ను అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించి వంద రోజులు దాటుతుందని ,అయినా ఇప్పటికీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు .1100 మంది అభ్యర్థుల జీవితాలు 13 సంవత్సరాలుగా అయోమయంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అనుసరించి ఏపీ ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఏపీ హైకోర్టు తీర్పు అనుసరించి డిఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రతిపాదన సిద్ధం చేశారన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించి 1100 మంది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సంగమేశ్వర్ కోశాధికారి జయప్రకాష్ నాయకులు బాబు రెడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.