Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగరిరూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీంల్లో పనిచేస్తున్న వర్కర్స్‌ను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు అన్నారు .శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కీంల్లో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నం భోజనం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిహామీ వివో ఏ వివిధ పథకాల్లో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న స్కీం వర్కర్లను పర్మనెంట్ చేయడం లేదన్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా కార్మిక చట్టాలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లందరిని పర్మినెంట్ చేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ ఉపాధ్యక్షురాలు సిహెచ్ రామకుమారి మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ నాయకులు నాగమణి చంద్రకళ కళ్యాణి శ్యామల పద్మాబాయి లలిత సరోజ కళమ్మ పద్మ జమున పాల్గొన్నారు.
రాజాపేట :కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను ప్రయివేటీకరణ చేయొద్దని, బడ్జెట్లో నిధులు పెంచి స్కీంలను మరింత బలోపేతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్కీం వర్కర్ల దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా రాజాపేట తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపి డిప్యూటి తహసీల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోబిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలవుతున్నా స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమైందని అన్నారు. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు చాలీచాలని వేతనాలతో కేంద్రం, రాష్ట్రం ప్రవేశపెట్టిన స్కీంలలో పనిచేస్తున్న వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోయలేని పని భారంతో కునారిల్లుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, పద్మ, రజిత, భారతి, కృష్ణలీల, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో స్కీం వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.పాష అన్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసన లో భాగంగా చౌటుప్పల్ మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ ఉప్పు రాజేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం, వికేపి, సర్వ శిక్ష అభియాన్ లతోపాటు వివిధ స్కీములలో పనిచేస్తున్న వర్కర్లకు చాలీచాలని వేతనాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బత్తుల దాసు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, వ్యకాస మండల కార్యదర్శి బొజ్జ బాలయ్య, జిపి వర్కర్స్ యూనియన్ నాయకులు పాపయ్య,శ్రీను, అంగన్ వాడి యూనియన్ నాయకులు సఫియ,సులోచన, కల్పన,మాధవి, సంధ్యారాణి, అరుణ, ఉపేంద్ర, వసంత తదితరులు పాల్గొన్నారు.
భూధాన్పోచంపల్లి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీం ల రక్షణ స్కీం వర్కర్ల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ శుక్రవారం మండల డిప్యూటీ తహసీల్దార్ మమతకు వినతి పత్రం ఇవ్వడం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ మంచాల మధు మాట్లాడుతూ స్కీంవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి ,అంజమ్మ ,వెంకటమ్మ అమత, నాలమ్మ, మంజుల, సంతోష, తదితరులు పాల్గొన్నారు .
వలిగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను ప్రయివేటికరణ చేయొద్దని, బడ్జెట్ లో నిధులు పెంచి బలోపేతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి. తూర్కపల్లి. సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు. రాదారపు. మల్లేష్, సింగరపు. వెంకటేష్, మెరుగు. వెంకటేశం, చేగురి. నగేష్, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను ప్రైవేటీకరణ చేయొద్దని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శుక్రవారం నాడు స్కీం వర్కర్లు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్న స్కీం వర్కర్లకు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, నాయకులు ఆకుల రమేష్, పాశం బాలయ్య, పొట్ట బాలరాజ్, బట్టు గణేష్, తదితరులు పాల్గొన్నారు.