Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
నిజజీవితంలో గణితం ఉపయోగాలు అనితరమని మేరీ మదర్ పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ విజ్జి అన్నారు.శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన గణిత క్లబ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నిత్యజీవితంలో గణితం యొక్క ఉపయోగాలను వివరించారు.ఆధునికకాలంలో తన విలక్షణ మేధాసంపత్తితో,అనన్య సామాన్యమైన కృషిచేసి,భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరంపై దశదిశాల ఎగరవేసిన మహా గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అన్నారు. గణిత శాస్త్రంకు సంబంధించిన గణిత నమూనాలతో కూడిన ప్రదర్శనలో విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత నమూనాలు,వాస్తవ సంఖ్యలు, అంతర కోణాలు,మేజిక్ చార్ట్, త్రికోణమితి నిష్పత్తిని కనుగొనుట వంటి నమూనాలు అందర్ని ఆకర్షించాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు గణితం యొక్క గొప్పతనం, ఉపయోగాలను గణితం యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో పాటల గేయాలు,డ్యాన్స్‌ల రూపంలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.అనంతరం పాఠశాలలోని గణిత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మేరీ రిన్సీ, స్టాఫ్ సెక్రెటరీ నాగరాజు, అసిస్టెంట్ సెక్రెటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.