Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
నాడైనా..నేడైనా ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణదినపత్రిక పాత్ర ప్రత్యేకమైనదని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు.మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నవతెలంగాణ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆ పత్రిక మండల రిపోర్టర్ కొలిపాక వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందడంలో ముందువరుసలో ఉందన్నారు.కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల ,పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవతెలంగాణ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరిరావు, పీఏసీఎస్ చైర్మెన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, డీటీ పద్మ, అర్ఐలు మట్టయ్య, స్వప్న, ఎంపీటీసీ రేవతి పరంధాములు, సర్పంచులు మామిడి వెంకన్న, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిట్టు నాగేశ్వరరావు, నెమ్మాది నగేష్, రేచల్ నాగేందర్, ధరావత్ శాలిబాయి పాల్గొన్నారు.