Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని పెండింగ్ పనులను త్వరత గతిన పూర్తి చేయించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమీషనర్ పీ.రామానుజులరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతి నిధులు క్రింద మంజూరైన రూ 4.00 కోట్లతో నిర్మిస్తున్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణము పనులను వారు పరిశీలించి మాట్లాడారు. ఈ భవన నిర్మాణము వల్ల మున్సిపాల్టీకి ఆదాయం రావడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఫై నిర్మాణము చేస్తున్న మహిళా భవన్ వల్ల మహిళలు సమావేశాలు నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డీఈ సత్యరావు, వార్డ్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న ,జహీర్,వెంపటి సురేష్ ,మున్సిపల్ డి.ఇ సత్యారావు ,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీను, హెల్త్ అస్సిటెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.