Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ఎస్సారెస్పీ కాలువల ద్వారా రెండో దశ నీటిని విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మండలకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.రైౖతులు చాలా మంది నారు పోసి నీటి కోసం ఎదురుచూస్తున్నారన్నారు.వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.ఎస్సారెస్పీ కాలువల ద్వారా విడుదలైన నీరును కూడా చివరి రైతులకు అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో ఉన్న కాలువలకు గండిపడడం, ఇతర ఆటంకాల ద్వారా చివరి వరకు నీరురాకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందులు పడు తున్నారన్నారు. దీంతో అధికారులు బాధ్యతలు తీసుకొని చివరి వరకు నీరు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న కుంటలు, చెరువులు నింపి బావులలో నీరు ఉండేందుకు కృషి చేయాలని కోరారు.పంట రుణాలను లక్ష రూపాయలు లోపు ఉన్న వారికి మాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు పల్లా సుదర్శన్, గడ్డంఎల్లయ్య, ముత్తయ్య, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.