Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభాలేశారు..వైర్లు బిగించడం మరిచారు..
- పట్టించుకోని విద్యుత్ అధికారులు
- ఇబ్బందులు పడుతున్న బాద్యతండావాసులు
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని బాద్యతండాలో 8 నెలల కింద గాలిదుమ్ములకు స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అధికారులు కొత్త స్తంబాలు వేశారు. కానీ విద్యుత్ వైర్లు అమర్చడం మర్చిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లోని తండాలోనే విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం ఉండి పనులు చెయ్యకుండా కాలయాపన చేస్తుంటే, మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ శాఖ అధికారులకు సమస్యను నెలల తరబడి విన్నవించిన పట్టించుకోవడంలేదని, తండాలో లూజ్లైన్లు, డామేజ్ స్తంభాలతో ఎప్పుడు ప్రమాదంతో జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని బాద్యతండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ అధికారుల నిర్వహణ లోపాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి.ప్రమాదాలు జరగక ముందే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.
వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం
బానోత్ దంలి-బాద్యతండా
విద్యుత్‌స్తంభాలు వేశారు.కానీ వైర్లు బిగించలేదు.వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళలో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
విద్యుత్ వైర్లు అమర్చాలి
బానోత్ నీల-బాద్యతండా
8 నెలలవుతున్నా విద్యుత్ అధికారులు స్తంభాలు వేసి విద్యుత్ వైర్లు అమర్చక పోవడంతో ఇబ్బం దులు పడుతున్నాం.అధికారులు నిర్లక్ష్యం వీడి తండాలో విద్యుత్‌ను సమస్యను పరిష్కరించాలి.