Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతువుల కళేబరాలు పడేస్తున్న వైనం
నవతెలంగాణ-కోదాడరూరల్
మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో ప్రధానరహదారి ప్రక్కన ఉన్న మురికికాలువ దుర్వాసన వెదజల్లుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.ఆ కాలువ సమీపంలో మేక, గొర్రె పోతుల మాంసం క్రయవిక్రయాలు జరుగుతుంటాయి.వాటికిి సంబంధించిన వ్యర్ధపదార్థాలను కాలువలో పోస్తుంటారని,దీంతో అవి కుళ్ళి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతుంటారు.అటుగా పాదచారులు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలుపుతున్నారు. అంతేకాకుండా సమీపంలో ఆటోలు నిలుపు స్థలము ఏర్పాటు చేశారు.ఆ దుర్వాసనకు అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా జంతు కళేబరాల వ్యర్ధాలు వేయడం వలన అక్కడ ఉన్న మురుగునీరు నిల్వ ఉన్నది దీంతో దోమలు విపరీతంగా వస్తున్నాయని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.దుర్వాసన భరించలేకపోతున్నాం.
ఆటోడ్రైవర్-పిచ్చయ్య
కాలువ సమీపంలో కొన్నేండ్లుగా ఆటో స్టాండ్ ఉన్నది, దుకాణదారుడు మూగజీవాల వ్యర్ధాలను కాలువలో వెయ్యడం వలన ఈ పరిస్థితి దాపురించింది.మురుగునీరు కూడా ఎటు వెళ్ళని పరిస్థితి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.