Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఎన్‌హెచ్ 65 పావన గుండ్ల నుండి నల్లగొండ అద్దంకి బైపాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ పిట్టంపల్లి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో జనవరి 9న పాదయాత్ర, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని చంద్రగిరి విలాస్ కాలనీలో ఇంటింటి కరపత్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కట్టంగూర్, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలు నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి దూర భారం తగ్గడానికి ఉపయోగంగా జాతీయ రహదారి పావన గుండ్ల నుండి నల్లగొండ అద్దంకి బైపాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. నల్లగొండ పట్టణ పరిధిలో అద్దంకి బైపాస్ నుండి బాధెగూడెం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేక మార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, నకిరేకల్, నల్లగొండ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పందించి, జిల్లా కేంద్రానికి రావడానికి ఉపయోగకరంగా ఉన్న ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను, ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ్మ, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఊట్కూరు రెడ్డి, చంద్రయ్య, మధు, వెంకటేశం, నరేష్, యాదయ్య ,తదితరులు పాల్గొన్నారు.