Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
నవతెలంగాణ-నాంపల్లి
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, వీఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పథకాలలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ స్కీంలలో పనిచేస్తున్న కోటి మందిపైగా కార్మికులలో అత్యధికంగా మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు పనిచేస్తున్నారని తెలిపారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని, ఆశ, అంగన్వాడీ, వీవోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ ఉపాధ్యక్షురాలు ఎదుల్ల కవిత, ప్రధాన కార్యదర్శి రామావత్ సునీత, సభ్యులు కోరే లలిత, ఏదుల్ల సునీత, వీవో ఎలా సంఘం మండల అధ్యక్షురాలు ఎస్కే. సైదా బేగం, రజిత, రాధిక, సైదమ్మ, మమత, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ తాసిల్దార్ కార్యాలయం ముందు స్కీం వర్కర్లు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీము వర్గాల రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కీంలలో పనిచేసే కార్మికులు ఇందిరా, అనురాధ, పుష్పలత, అలివేలు, పద్మ, బిక్షపమ్మ తదితరులు పాల్గొన్నారు.
త్రిపురారం : త్రిపురారంలో శుక్రవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర నాయకులు ప్రమీల ఆధ్వర్యంలో వైద్యాధికారికి వినత పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, జిల్లా నాయకులు భూలక్ష్మి, ప్రేమలత, సీత, రోహిణి, అమీరా, సుజాత, రాణి ,రమాదేవి, వెంకటరమణ, తదితరులున్నారు.
దామరచర్ల : స్కీం వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దామరచర్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దయానంద్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కరిమున్నిసా, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు మహేశ్వరి, జయమ్మ, ఐకేపీ నాయకులు నాగలక్ష్మి, శ్రీలక్ష్మీ , రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
హలియా : కేంద్ర ప్రభుత్వం వివిధ స్కీంలో ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఏజెన్సీ ఇతర రంగాలను ప్రైవేటుపరం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, తక్షణమే ఉపసంహరించుకొని రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాలియాలో ఆశా వర్కర్లతో నిరసన వ్యక్తపరుస్తూ హాలియా వైద్య అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రాస్ నాయకులు ప్రమీల, జిల్లా నాయకులు భూలక్ష్మి, రామేశ్వరి, పార్వతి, ఇందిరమ్మ, నాగేంద్ర, సువర్ణ, నాగరాణి, ఎల్లమ్మ, తదితరులున్నారు.