Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పట్టణంలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలలో మొక్కలకు పాదులు తీసి నీటిని పోసి సంరక్షించుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి అన్నారు. హరిత శుక్రవారంలో భాగంగా పట్టణంలోని 13వ వార్డు ప్రజలతో కలిసి హనుమాన్ గుడి ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు హరిత శుక్రవారం రోజు పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలని సూచించారు. కుండీలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకొవాలని ఫ్రైడే, డ్రై డేగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఉట్కూరు వెంకటరెడ్డి, డీఈ వెంకన్న, ఏఈ రవీందర్, హరితహారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.