Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందమైన పట్టణంగా చండూరు
- మత్రి కె.తారక రామారావు
నవతెలంగాణ- చండూరు
చండూరు పట్టణం లో 40 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రాబోయే నాలుగైదు నెలల్లో అభివద్ధి కార్యక్రమాలతో అందమైన చండూర్ పట్టణం గా చేస్తామని రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధ్ధి,పరిశ్రమలు,చేనేత,జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.శుక్రవారం మంత్రి చండూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 30 కోట్ల రూపాయలతో నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు, రెండు కోట్ల 50 లక్షలతో మురుగు కాలువల నిర్మాణానికి, మూడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, రెండు కోట్లతో నిర్మించే నూతన పురపాలక సంఘ భవన నిర్మాణ పనులకు, రెండు కోట్ల రూపాయలతో నిర్మించే సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు, 50 లక్షలతో నిర్మించే మున్సిపల్ వాణిజ్య సముదాయ నూతన భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత డిసెంబర్ 1న మునుగోడులో మున్సిపల్, పంచాయతీ రాజ్, రోడ్లు, నీటిపారుదల, విద్యుత్,గహ నిర్మాణ శాఖల కు సంబందించి మంత్రులు, అధికారులతో చర్చించి అభివద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రణాళిక రూపొందించి అందులో భాగంగా చండూరులో 40 కోట్లలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. 8 కోట్ల 91 లక్షల 75 వేల రూ. ల తో గట్టుప్పల్, తేరటి కల్ చేనేత క్లస్టర్లకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లా ల మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున అభివృద్ధ్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో నల్లగొండ గోసపడ్డ జిల్లా అని, తాగునీరు లేక ఫ్లోరోసిస్ నీటితో బొక్కలు వంకరపోయాయని, ముఖ్యమంత్రి నేతత్వంలో తెలంగాణ సాధించుకున్నాక మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిన్ రక్కసిని తరిమేసామన్నారు. శివన్నగూడెం,లక్ష్మణా పురం రిజర్వాయర్ల ద్వారా సాగునీటి వసతి కల్పిస్తామని తెలిపారు. చండూరులో ఇంకా ఏమైనా అసంపూర్తి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. పేదవారి పట్ల గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా గతం లో ఉన్న 29 లక్షల పెన్షన్ లు రాష్ట్ర ప్రభుత్వం బీడీ, నేత, గీత, ఒంటరి మహిళ, వికలాంగులు, వృద్ధులు అందరికి అండగా ఉంటూ ఆసరా పెన్షన్లతో నేడు రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు కల్పించి వారి లబ్ది చేకూర్చడం జరిగిందని అన్నారు.
ప్రతి పేద ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు
ప్రతి పేద వాని గడప గడప కు దరి చేరేలా సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళిక బద్దంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలన,పట్టణ అభివృద్ధి,పరిశ్రమలు,చేనేత శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.శుక్రవారం గట్టుప్పల్ మండలం లో 2 కోట్ల రూ.లతో నిర్మించనున్న సీసీరోడ్లు,డ్రైన్ లకు మంత్రి శంఖు స్థాపన చేశారు. అదే విధంగా 8 కోట్ల 91 లక్షల 75 వేల రూ. ల తో గట్టుప్పల్, తేరట్ పల్లి చేనేత సమూహాలకు భూమి పూజ,నేతన్నకు సహాయం చేసే సంక్షేమ పథకాలు అంద చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేతన్న కు ఇచ్చిన మాట ప్రకారం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పి శంకు స్థాపన చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చేనేత క్లస్టర్ల వల్ల గట్టుప్పల్ లో 460 మంది , తేరట్ పల్లి లో 190 మంది లబ్ది దారులకు మేలు కలుగుతుందన్నారు. రెండు నెలల క్రితం నవంబర్ 6 న మును గోడ్ నియోజక వర్గ శాసన సభ్యులు గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించారని,గెలిపించిన తర్వాత రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటించి నట్లు తెలిపారు.మళ్లీ ఫిబ్రవరి లో వస్తానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర చేనేత వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గట్టుప్పల మండల కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. ముందు గా చండూరు లో హెలిపాడ్ కు చేరుకున్న మంత్రి కెటిఅర్ కు జిల్లా కలెక్టర్ టి.వినరు కష్ణా రెడ్డి,జడ్పిచైర్మన్ బండ నరేందర్ రెడ్డి,శాసన సభ్యులు కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి లు పుష్ప గుచ్ఛం తో స్వాగతం పలికారు.హెలిపాడ్ నుండి నేరుగా గట్టుప్పల్ మండల కేంద్రం కు చేరుకున్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్రెడ్డ్డి,రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి.లు ఎల్. రమణ,ఎం.సి.కోటి రెడ్డి,శాసన సభ్యులు కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్,రవీంద్ర నాయక్,జిల్లా కలెక్టర్ టి.వినరు కష్ణా రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా,అర్డిఓ జయ చంద్ర రెడ్డి,స్థానిక ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు .
రూ.100 లక్షల కోట్లు అప్పులు చేసిన మోడీ
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
హుజూర్నగర్ : ఇప్పటివరకు పనిచేసిన 14 మంద్రి ప్రధానమంత్రులు రూ.56 లక్షల కోట్లు చేస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ మాత్రం రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సబ్ ట్రెజరీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు.పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్యేగా సైదిరెడ్డి గెలిచి మూడేండ్ల రెండునెలలవుతుందన్నారు. గెలిచిన మూడవ రోజు 26 అక్టోబర్ కేసీఆర్ విజయోత్సవ సభ నిర్వహించి హుజూర్నగర్ అభివద్ధికి కట్టుబడి ఉంటామని వాగ్దానం చేశామన్నారు.ఈ మూడేండ్ల కాలంలో రూ.3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సాగునీటి రంగాలకు రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు. లిఫ్టులు,కాలువల మరమ్మతులకు ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.ఎస్టీఓ కార్యాలయం ప్రారంభించుకుందామని, ఈఎస్ఐ ఆస్పత్రి డిస్పెన్సరీ ప్రారంభించుకుందామన్నారు.స్థానిక న్యాయవాదుల కోరిక మేరకు అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా మంజూరైందని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కోరిక మేరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ భవనం కోసం, యువత కోసం జిమ్ములు, స్థానిక మేళ్ల చెరువు మండలంలోని శివాలయం అభివద్ధికి అదేవిధంగా జాన్పాడు దర్గా అభివద్ధికి హుజూర్నగర్,నేరేడుచర్లలో స్టేడియం ఏర్పాటుకు నేరేడుచర్ల మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, ఇతరఅభివద్ధి పనులకు మరో రూ.30 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భారత దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మేధావి అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటికే 85శాతం పూర్తి చేశామని, మరో 15శాతం కూడా పూర్తి చేస్తామన్నారు.స్థానిక ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చేయని అభివద్ధి కార్యక్రమాలను తాను చేసి చూపెట్టానన్నారు.హుజూర్‌నగర్‌లో ఆర్డీఓ కార్యాలయం నియోజకవర్గ పరిధిలో చెక్ డ్యాములు, గ్రామగ్రామాల్లో తండాలలో సీసీరోడ్లు ఎప్పటికీ పూర్తి చేశామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ చైర్మెన్ విజయసింహారెడ్డి, రైతుబంధు రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్, గాదరికిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, వేముల వీరేశం, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు, హుజూరనగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని, ఎంపీపీ ముడావత్ పార్వతి కొండానాయక్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చిట్యాలఅమర్నాథ్రెడ్డి, బెల్లంకొండ అమర్ పాల్గొన్నారు.