Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ కోరారు.శనివారం మండలకేంద్రంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద రవాణారంగ కార్మికుల సంఘర్షయాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.యాత్ర జనవరి 3న ఖమ్మంలో ప్రారంభమై జీపుయాత్ర 2023 జనవరి 8న మన యాదాద్రి భువనగిరి జిల్లాకు రాబోతున్నదన్నారు.యాదగిరిగుట్ట,ఆలేరులో జరిగే సభలలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర ఆటో యూనియన్ అధ్యక్షులు బోయిని సత్తయ్య, ట్రాన్స్పోర్టు రంగం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన బలరాం, జిల్లా కమిటీ సభ్యులు కట్కూరి వెంకటేశం, ఆటోయూనియన్ మండల నాయకులు సోమన్న గణేష్, సోమల మల్లేశం, కోట శ్రావణ్, భూక్యా జ్వాలానాయక్,సరిమానాయక్, బోయిని శివకుమార్,కోట నర్సింహ, కొక్కొండ పోచయ్య పాల్గొన్నారు.