Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
చదువుల తల్లి, సంఘసంస్కర్త, బాలల హక్కుల కోసం నిరంతరం కృషి చేసే జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్మెన్, రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత శాంతా సిన్హా పుట్టినరోజు వేడుకలు శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని నెంబర్ 2 పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ సమితి, జిల్లా అధ్యక్షులు ఆవులవినోద్,ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ శాంతాసిన్హా ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి నేటి మహిళా ఉపాధ్యాయులు కషి చేయాలని కోరారు. బాలల హక్కుల కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాల్యవివాహాల నిర్మూలనకు ఎంతో కృషి చేశారన్నారు. జిల్లా కేంద్రమైన నంబర్ 2 పాఠశాలలో ప్రతి శనివారం జరిగే బాలసభలో భాగంగా ఈరోజు శాంతా సిన్హా పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ పుట్టినరోజు వేడుకలలో నెంబర్-2 ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, ఉపాధ్యాయులు శైలజ,విజయ, వరలక్షి,బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆత్మకూరు(ఎం) మండల అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం, విద్యా ఉద్యమం జిల్లా నాయకులు ముడుగుల శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.