Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద ఏకలవ్య సత్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నర్సింహ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు మండలకేంద్రంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో ఏకలవ్య సత్రం ఏర్పాటు చేయాలని, పందుల పెంపకం దారులకు ప్రత్యేక న్యాయం చూపించాలని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కూతాడి సురేష్, జిల్లా ప్రధానకార్యదర్శి కూతాడి యాదగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కూతటి అంజన్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మనుపటి అంజి, కుతాటి అఖిల్,కావడిసంతోష్, అంగడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.