Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
డయాలసిస్ వ్యాధి గ్రస్తులకు మెరుగైన సేవలతో పాటు మానసికంగా మనోధైర్యాన్ని డాక్టర్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు.మండలకేంద్రంలో శనివారం ప్రభుత్వ విప్, సునీత డయాలసిస్ సెంటర్ను,ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు.మెరుగైన సేవలతో పాటు మనోధైర్యం అందించాలనికోరారు. గవర్నమెంట్ హాస్పిటల్ నందు, డయాలసిస్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.డయాలసిస్ ప్రభుత్వాసుపత్రి వైద్య బందం,ఆస్పత్రి సిబ్బంది,బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.